పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సామాజిక వేత్త మరియు జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం జెడ్ పి హెచ్ ఎస్ బంగారుగడ్డ పాఠశాల ఉపాధ్యాయులు కరపత్రాల ద్వారా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు అందులో భాగంగా సోమవారం ఉపాధ్యాయుల బృందంతో కలిసి ఇంటింటికి కరపత్రాల పంపిణీ చేశారు. స్థానిక బంగారుగడ్డ ప్రజలను కలిసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని కోరడం జరిగింది.