శుక్రవారం మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ, యదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను ప్రైవేటీకరించే కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో చేసిన విజ్ఞప్తిని గౌరవించి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మిర్యాలగూడ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ సుమారు రూ. 30 వేల కోట్ల వ్యయంతో యదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ ప్లాంట్ కేవలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మాత్రమే కాదని, వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే మహత్తర ప్రాజెక్ట్ అని ఆయన అన్నారు.