రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కొనుగోలు కేంద్రాలు దళారులకు అడ్డాగా మారి రైతులను దోపిడీ చేస్తున్నాయని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు నిమ్మల నవీన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం మాడ్గులపల్లి మండలం సీత్యా తండా గ్రామపంచాయతీలో వేములపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు.