మిర్యాలగూడలో అమానవీయ సంఘటన

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బుధవారం అమానవీయ సంఘటన వెలుగుచూసింది. షాబునగర్ లోని మురుగుకాల్వలో గర్భస్థ ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. పారిశుద్ధ్య కార్మికుడు చెత్త తొలగిస్తుండగా కవర్ లో చుట్టి ఉన్న మృతదేహం బయటపడింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, వన్ టౌన్ సీఐ నాగభూషణంలు దర్యాప్తు చేస్తున్నారు. ఆడ శిశువు కావడంతోనే అబార్షన్ చేయించి కాల్వలో పడవేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్