నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఆదివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా బీసీ భవనంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నియోజకవర్గం అధ్యక్షులు పిల్లల మర్రి రవికుమార్, పున్న రాములు, రాపోలు సత్య నారాయణ, బీసీ జేఏసీ ప్రతినిధులు చేగొండి మురళీ యాదవ్, కొంగరి మహేష్, కొంగరి కిరణ్, పున్న సతీష్, పున్న దయాకర్, గుర్రం యాదగిరి, తిరుపత్తయ్య, గుర్రం శ్రీనివాస్ పాల్గొన్నారు.