మిర్యాలగూడ మండలపరిధిలోని కొత్తగూడెంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. వాణి అనే యువతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా ఓ వ్యక్తి వేదింపుల కారణంగానే యువతి మృతి చెందిందని కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.