నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిరుద్యోగులనే టార్గెట్ గా చేసుకొని, ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశామని డీఎస్పీ రాజశేఖర్ రాజు శనివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ మోసాలకు పాల్పడుతున్నా ముగ్గురు వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.