అమెరికాలోని లూసియానాలో కాలువలో కొట్టుకుపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడే ప్రయత్నంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అనురూప్ రెడ్డి అనే తెలుగు యువకుడు మృతి చెందాడు. టెక్సాస్, లూసియానా సరిహద్దులోని టొలెడో బెండ్ రిజర్వాయర్ వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. స్నేహితులు కాలువలో మునిగిపోతుండగా వారిని రక్షించిన అనురూప్ రెడ్డి, అనంతరం కాలువలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. రెస్క్యూ సిబ్బంది 20 అడుగుల లోతులో అతని మృతదేహాన్ని వెలికితీశారు.