నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద కాలేజీ బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ గురువారం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రావలసిన ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియజేయాలని ఆయన అన్నారు. ఈ బంద్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జరిగింది.