మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం.. 14 గొర్రెలు మృతి

నల్గొండ జిల్లా, మిర్యాలగూడ నియోజకవర్గంలోని నందిపహాడ్ జంక్షన్ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల మందను రోడ్డుపై తోలుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో కొన్ని గొర్రెలు అక్కడికక్కడే మరణించగా, మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి.

సంబంధిత పోస్ట్