ముగిసిన రెండవ విడత నామినేషన్ల పర్వం

గ్రామపంచాయతీ ఎన్నికల రెండవ విడత నామినేషన్ల స్వీకరణ శనివారం ముగిసింది. మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్‌లోని పది మండలాల్లో 282 సర్పంచ్‌, 2,418 వార్డులకు గాను నవంబర్ 30న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో మూడు రోజుల్లో 282 సర్పంచ్‌ స్థానాలకు 2,057, 2418 వార్డు సభ్యులకు 5,908 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. డిసెంబరు 14వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

సంబంధిత పోస్ట్