రెండోవిడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఆదివారం ఉదయం మొదలైంది. జిల్లాలోని మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో 282 పంచాయతీల ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. వెంటనే 282 సర్పంచ్, 2,418 వార్డులకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 163 మంది, వార్డులకు 156 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లకు 2వ తేదీ వరకు గడువు ఉంది.