అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది

మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. మిర్యాలగూడ మెయిన్ కెనాల్ లైనింగ్‌కు రూ. 57 కోట్లు, దుబ్బతండ, శాంతినగర్, రావులపెంట చెక్‌డాంలకు రూ. 24 కోట్లు, ఫీడర్ చానళ్లకు రూ. 20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సాగునీరు అందించే ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కొనసాగుతున్న ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు త్వరలో పూర్తవుతాయని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్