నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్

నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని మిర్యాలగూడ టూ టౌన్ సీఐ నాగార్జున హెచ్చరించారు. శనివారం టూటౌన్ పరిధిలో వాహన తనిఖీలు చేయగా నెంబర్ ప్లేట్లు లేకుండా నడుపుతున్న 15 ద్విచక్ర వాహనాలు పట్టుబడినట్లు తెలిపారు. కౌన్సిలింగ్ ప్రక్రియతో ముగిసిన తనిఖీలు జూలై 1నుండి కట్టుదిట్టం కానున్నట్లు పేర్కొన్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే సీజ్ చేయడంతో పాటు యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్