నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మించిన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని (వైటీపీఎస్) ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం (ఆగస్టు 1) జాతికి అంకితం చేశారు. 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల మొదటి యూనిట్‌ను జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. వారి వెంట శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా ఉన్నారు.