మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

చండూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చండూరులో రైతులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడెం, గట్టుప్పల్ మండలాల్లో రైతులు అధిక సంఖ్యలో మొక్కజొన్న పంటను పండిస్తున్నప్పటికీ సరైన మార్కెట్ సౌకర్యాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రైతులు తమ పంటను తక్కువ ధరలకు దళారులకు అమ్ముకోవాల్సి వస్తుందని అన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్