కట్టవారిగూడెం యువకుడికి బ్లాక్ బెల్ట్..

గుర్రంపోడు మండలం కట్టవారిగూడెం గ్రామానికి చెందిన కట్ట అయోధ్య రాములు కరాటేలో విశేష ప్రతిభ కనబరిచి బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్ సాధించాడు. హైదరాబాద్‌లో షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాక్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌లో అతను ఈ ఘనత సాధించాడు. ప్రముఖ సినీ హీరో, కరాటే లెజెండ్ హన్షీ డాక్టర్ సుమన్ తల్వార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అయోధ్య రాములుకు బ్లాక్ బెల్ట్, సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, విద్యార్థులు ఏకాగ్రతతో సాధన చేస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్