చౌటుప్పల్ నుంచి బీబీనగర్ ఎయిమ్స్‌కు బస్సు సౌకర్యం కల్పించాలి

చౌటుప్పల్ నుంచి బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రికి నేరుగా బస్సు సౌకర్యం కల్పించాలని మునుగోడు నియొజకవర్గ ప్రజలు కోరుతున్నారు. చౌటుప్పల్, పరిసర గ్రామాల నుంచి వైద్యం కోసం ప్రతిరోజూ పలువురు బీబీనగర్ ఎయిమ్స్‌కు వెళ్తున్నారని తెలిపారు. నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు బస్సులు మారుతూ ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా రోగులు, వృద్ధులు, వారి సహాయకులకు ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని ప్రజలు పేర్కొన్నారు. చౌటుప్పల్ నుంచి బీబీనగర్ ఎయిమ్స్‌కు నేరుగా బస్సు సర్వీసు ప్రారంభిస్తే ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్