చౌటుప్పల్: వ్యవసాయ పొలాల్లో హల్ చల్ చేస్తున్న అడవిదున్న

చౌటుప్పల్ మండలంలో అడవి దున్న ప్రత్యక్షమైంది. గురువారం చిన్న కొండూరు, పెద్ద కొండూరు గ్రామాల మధ్య పొలాల్లో అదవిదున్నను గుర్తించిన స్థానిక రైతులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ అధికారులు దున్నను పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగా సాయంత్రం వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో అడవి దున్న కనిపించింది.

సంబంధిత పోస్ట్