నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను శుక్రవారం ఎంపీడీవో వసంతలక్ష్మి, తహసీల్దార్ రాములు ప్రారంభించారు. కబడ్డీ, కోకో, వాలీబాల్, యోగా క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో క్రీడాకారులు ప్రతిభ చూపి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీఓ సునీత, ఎంఈఓ అమృతాదేవి, సర్పంచ్‌లు నామని జగన్నాథం, క్రీడాకారులు పాల్గొన్నారు.