మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, సీఎం సభకు వెళ్లకుండా ఎమ్మెల్యేను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మండల కాంగ్రెస్ నాయకులు జంగిలి నాగరాజును కూడా నివాసంలో నిర్బంధించి, మునుగోడు స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ నాగరాజు ప్లకార్డుతో మునుగోడు పోలీస్ స్టేషన్‌లో నిరసన వ్యక్తం చేశారు.