సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా

మునుగోడు నియోజకవర్గంలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సబ్ స్టేషన్ ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. వరి నాట్లు వేసిన రైతులు చాలీచాలని కరెంటుతో ఇబ్బందులు పడుతున్నారని, కరెంటు సమస్యలను పరిష్కరించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య అన్నారు. అనంతరం మండల తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాస్ కు కరెంటు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కొట్టం యాదయ్య, సల్వోజ్ రామలింగాచారి, ఏర్కొండ రాఘవేంద్ర, మల్ రెడ్డి నరసింహారెడ్డి, ఏర్కొండ యాదయ్య, ఊరు పక్క వెంకటయ్య, కృపాకర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕