బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.

నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో, తెలంగాణ సాధకుడు, ఉద్యమనేత, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు విచారణ పేరుతో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆదివారం బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మండల చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ధర్నాలు చేపట్టారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్‌ను వేధిస్తుందని, వారిని అవమానిస్తూ అమానుషంగా ప్రవర్తిస్తుందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్