నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి వసంత లక్ష్మి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి వి సునీత, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, గ్రామపంచాయతీ సిబ్బంది యాదయ్య పాల్గొన్నారు.