చౌటుప్పల్ మండలం జెకేసారం గ్రామంలో గోకారం చెరువులో నీళ్లు లేక, బోర్లు, బావుల్లో నీరు అడుగంటడంతో సుమారు 150 ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోయాయి. ఇంటింటికి సీపీఎం కార్యక్రమంలో భాగంగా శనివారం సీపీఎం బృందం రైతులతో కలిసి ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు రాగిరి కిష్టయ్య మాట్లాడుతూ, ఎండిపోతున్న పొలాలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.