రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

మునుగోడు మండలం గుండ్లోరిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త వర్కాల సైదులు (38) పది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కుటుంబానికి టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి నారబోయిన రవి రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సహాయాన్ని బుధవారం జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు జంగిలి నాగరాజు మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈర్ల సత్తయ్య, బొల్లం మహేష్ మరియు బొల్లం శ్రీశైలం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕