మునుగోడులో రోడ్డు పనులకు శంకుస్థాపనలు

మునుగోడు నియోజకవర్గంలో పలు రోడ్డు అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. సర్వేల్‌లో మూడు, పొర్లగడ్డ తండాలో రెండు, కేలోతు తండాలో ఒకటి, అంతంపేటలో రెండు రోడ్డు పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయి. మొత్తం రూ. 113. 06 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల్లో పలు గ్రామాలను కలిపే రహదారుల అభివృద్ధి ఉంది. పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు మెరుగైన సౌకర్యం కలగనుంది.

సంబంధిత పోస్ట్