మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో ప్రధాన కూడలి Y జంక్షన్లో గాంధీ విగ్రహ పునః ప్రతిష్ట శంకుస్థాపన కార్యక్రమం గురువారం జరిగింది. రహదారి విస్తరణలో భాగంగా తొలగించిన పురాతన గాంధీ విగ్రహం స్థానంలో నూతన విగ్రహం ఏర్పాటుకు గాంధీ సెంటర్ కమిటీ, యూత్ సభ్యులు నిర్ణయించారు. గ్రామ పెద్దలు, పురాతన గాంధీ విగ్రహ దాత వైద్యుడు ఇడికుడ యాదగిరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.