రాష్ట్రంలో క్యాబినెట్ కూర్పు తర్వాత తొలిసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తనకు రాజకీయాలు అంటే పదవులు లేదా అధికారాలు కాదన్నారు. తాను మంత్రిగా లేకపోయినా పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని బుదవారం తెలిపారు. తన రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదని, పదవి లేకున్నా ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తిమంతంగా మారుస్తుందని పేర్కొన్నారు.