కోడి వెంకన్న దంపతులు కాంగ్రెస్ లోకి: కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమక్షంలో చేరిక

నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గంలో చండూరు మున్సిపాలిటీకి చెందిన బిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్, సన్ షైన్ విద్యా సంస్థల చైర్మన్ కోడి వెంకన్న, డిసిసిబి మాజీ డైరెక్టర్ కోడి సుష్మా వెంకన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వారిని కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 15 ఏళ్లుగా అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించి, కోడి బ్రదర్స్ కుటుంబాలను కలిపిన కోమటిరెడ్డి రాజన్న చతురతతో ఈ చేరిక జరిగింది.

సంబంధిత పోస్ట్