నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండల కేంద్రంలో ఆదివారం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదవ విడత ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి ప్రారంభించారు. 900 మందికి పరీక్షలు జరిగి, 230 మందిని ఆపరేషన్‌లకు ఎంపిక చేశారు. వీరిలో 129 మందిని గచ్చిబౌలిలోని శంకరా ఆసుపత్రికి తరలించారు.