చౌటుప్పల్ మండలం అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన దూపం సారమ్మ, మోతె జంగమ్మలు గురువారం మైసమ్మ ఆలయానికి వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో బస్సు కోసం ఎదురుచూస్తుండగా గుర్తు తెలియని ఆటో వచ్చి ఢీ కొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్ తరలించారు. దూపం సారమ్మ కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.