నల్గొండ: రాజగోపాల్‌రెడ్డి రెడ్ బుక్‌పై అందరి లుక్..!

నల్గొండ జిల్లా రాజకీయాల్లో రాజగోపాల్‌రెడ్డి సిద్ధం చేసిన రెడ్‌ బుక్‌ కలకలం రేపుతోంది. గతంలో పార్టీ మారినప్పుడు డబ్బులు తీసుకొని, ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచిన నేతల చిట్టాను ఆయన సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల కోసం వస్తున్న ద్వితీయ శ్రేణి నేతలకు ఈ రెడ్‌ బుక్‌ చూపించి, నమ్మకద్రోహం చేసిన వారికి పదవులు లేవని స్పష్టం చేయడంతో ఆశావహుల్లో వణుకు మొదలైంది.

సంబంధిత పోస్ట్