మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని పురాతన శివరామ క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. దైవ దర్శనం తోనే ప్రతి మనిషిలో సానుకూల దృక్పథం అలవాటు అవుతుందని, దైవ అనుగ్రహం లేనిది ఏదీ జరగదని ఆయన అన్నారు. గుడి వ్యవహారంలో రాజకీయాలు చేయొద్దని, సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే ప్రతిదీ సానుకూలంగానే ఉంటుందని, గుడి విషయంలో ప్రతి ఒక్కరూ నిస్వార్ధంగా, పారదర్శకంగా, భక్తి భావంతో మెలగాలని ఆయన సూచించారు.