గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, సోమవారం నాంపల్లి పట్టణం మరియు పసునూరు సమస్యాత్మక గ్రామాలలో నాంపల్లి సీఐ డి. రాజు ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు. ఎన్నికలు శాంతియుతంగా జరుపుకోవాలని, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.