మునుగోడులో ముందస్తు అరెస్టులు: సీఎం పర్యటనతో కలకలం

నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. చండూరులో మాల మహానాడు నాయకులను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యలను మాల మహానాడు నాయకులు ఖండించారు. సీఎం సభ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉన్నాయి. పలువురు నాయకులను చండూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసు నిఘా కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్