చండూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేస్తోందని, బాలికలు, మహిళలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వ్యాక్సిన్ పూర్తిగా ఉచితంగా లభిస్తుందని తెలిపారు.