కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా

కేంద్రం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశను మిగిల్చిందని, కార్పొరేట్లకు వరంగా మారిందని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, రాష్ట్రం నుండి వేల కోట్ల పన్నులు కేంద్రానికి వెళ్తున్నా, తిరిగి నిధుల కేటాయింపులో తెలంగాణ పట్ల వివక్ష చూపారని మండిపడ్డారు. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్