నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వేరుశనగ పంట సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎస్. పద్మజ పాల్గొని, ఆధునిక యాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణ, ఎరువుల సమతుల్య వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. సరైన సాగు పద్ధతులతో దిగుబడులు పెరుగుతాయని ఆమె తెలిపారు.