త్రిపురారం మండలం రూఫ్లా తండా గ్రామానికీ చెందిన సీనియర్ ఉపాద్యాయుడు, ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత ధనావత్ విద్యా చందర్ నాయక్ ఇటీవలే మిర్యాలగూడ డివిజనల్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. అడవిదేవులపల్లి మండలం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా సోషల్ స్టడీస్ విభాగంలో పనిచేస్తున్న ఆయనకు అవార్డు రావడం చాలా గర్వకారణం అని ఈ శుభ సందర్భంగా శనివారం సర్పంచ్ ధనావత్ రఘు నాయక్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. విద్యా చందర్ నాయక్ ప్రతిఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.