ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం వీరు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకానున్న కనగల్, నల్గొండ ఎన్. జి. కళాశాల బహిరంగ సభ సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. కనగల్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి 13006 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న హ్యాం రోడ్లకు శంకుస్థాపన పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. అక్కడి నుండి నల్గొండ చేరుకొని నాగార్జున కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.