నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పర్వేదుల గ్రామంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది. మండల అధ్యక్షుడు జటావత్ రవి నాయక్, ఎంపీపీ సలహాదారుడు చెన్ను సుందర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ తమ కార్యకర్తలకే కేటాయిస్తూ పేదలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రజలు దీనిని గుర్తించారని, కాంగ్రెస్‌ను బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.