నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని శ్రీరాంపురం ప్రాథమిక పాఠశాలలో సుమారు 6000 రూపాయల విలువైన నోట్ బుక్స్, సామాగ్రి, జామెంట్రీ బాక్స్, పలకలు, టేబుల్ బుక్స్, స్కేల్స్ మరియు LKG & UKG విద్యార్థులకు పుస్తకాలను దాత శ్రీ గజ్జల నాగార్జున రెడ్డి అందించారు. ఈ సందర్భంగా పాఠశాల తరఫున ఆయనను సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ప్రధానోపాధ్యాయులు ఫరీద్ గారు కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ నాగమణి, ఉపాధ్యాయురాలు మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.