శనివారం నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ పాత పోలీస్ స్టేషన్ గ్రౌండ్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన పాలపర్తి కాత్యాయని అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.