చౌళ్ళతండాలో తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ సర్పంచ్

మాటూరు గ్రామ పంచాయతీ చౌళ్ళతండాలో బంజారాల తీజ్ పండుగను గురువారం ఘనంగా జరిపారు. మాజీ సర్పంచ్ వాంకుడోత్ లలిత పాండు నాయక్ మహిళలతో కలిసి చిందులు వేసి, సేవాలాల్ మహారాజ్‌కు పూజలు చేశారు. వర్షాలు కురిసి పంటలు పండాలని కోరారు. ఈ ఉత్సవంలో మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్