గుర్రంపూడి మండలంలోని కొప్పోలు గ్రామంలో పూర్తి గ్రామం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలంటూ ఎస్సై మధు సూచించారు. దొంగతనాలు, యాక్సిడెంట్లు, ఆకతాయిల వ్యవహారాలపై నివారణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దాదాపు రూ.2 లక్షల ఖర్చు అవుతుందనీ, గ్రామస్తులందరూ సహకరించి ఈ మంచి పనిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.