నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్ నియోజకవర్గం, త్రిపురారం మండలం కామారెడ్డి గూడెం లోని SC కాలనీలో ఆదివారం గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం మహా అన్న వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాప కంటి సుష్మ గిరి, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ అస్సేన్, వార్డు సభ్యులు, SC కాలనీ యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అన్న వితరణలో సర్పంచ్ సుష్మ గిరి పాల్గొన్నారు.