సోమవారం నల్గొండ జిల్లా అనుముల మండలం, చల్మారెడ్డి గూడెం, పుల్లారెడ్డి గూడెం గ్రామాలలో జరుగుతున్న శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, ప్రజలందరూ గంగమ్మ తల్లి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో చల్లగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.