మిర్యాలగూడ: పీడీఎస్ అక్రమ రవాణకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని డిఎస్పీ రాజశేఖర్ హెచ్చరించారు. మంగళవారం డిఎస్పీ కార్యాలయంలో మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపామని తెలిపారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్ లో ఒక లారీ రెండు బొలెరో వాహనాలను పట్టుకుని 74 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.