నల్గొండ: పూజల పేరుతో మోసం.. దొంగ బాబాల అరెస్ట్

నేలకొండపల్లి మండలం నాచేపల్లి గ్రామంలో మంగళవారం, పూజల పేరుతో మోసం చేస్తున్న దొంగ బాబాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన తూర్పాటి ఎర్రయ్య గురువు ఆధ్వర్యంలో తిరుగుతున్న ఐదుగురు, ఇంట్లో దోషాలు తొలగిస్తామని, పిల్లలు లేని వారికి పిల్లల కోసం పూజలు చేస్తామని నమ్మించి మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. రేగిల్ల కోటి కోటేశ్వరి ఇంట్లో పూజల పేరుతో రూ. 2000 తీసుకున్నారని, అనుమానం వచ్చి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామాలకు వచ్చే బాబాలను నమ్మవద్దని నేలకొండపల్లి ఎస్సై సంతోష్ కుమార్ సూచించారు.

సంబంధిత పోస్ట్